నందికొట్కూరు: కేసీ కెనాల్ తూము తెరవాలని డిమాండ్

63చూసినవారు
నందికొట్కూరు: కేసీ కెనాల్ తూము తెరవాలని డిమాండ్
నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలం ప్రాతకోట గ్రామంలో కేసీ కెనాల్ అభివృద్ధి పనుల సమయంలో మూసివేసిన తూమును తిరిగి తెరిపించాలని సిీపీఐ నందికొట్కూరు కార్యదర్శి వీవీ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే గిత్త జయసూర్యకు వినతిపత్రం అందజేశారు. 347 ఎకరాల నాన్ ఆయకట్టు పొలాలకు సాగునీరు లభించక రైతులు నష్టపోతున్నారని, తూము తెరిచి నీరు అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్