రాష్ట్ర ప్రభుత్వం పెంచిన భూ రిజిస్ట్రేషన్ చార్జీలు తగ్గించాలని సిపిఎం నాయకులు పి. పక్కిరి సాహెబ్, టి. గోపాలకృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం నందికొట్కూరు సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని సిపిఎం నాయకులతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ. భూ రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడం వల్ల మధ్యతరగతి ప్రజలపై భారం పడుతుందని, రిజిస్ట్రేషన్ చార్జీలు తగ్గించకపోతే ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.