సావిత్రిబాయి పూలేను మహిళలు, విద్యార్థినిలు ఆదర్శంగా తీసుకోవాలని వారి అడుగు జాడలలో నడిచి సమాజంలో ఉన్న అసమానతలను రూపుమాపడానికి కృషి చేయాలని, సిపిఐ జిల్లా నాయకులు రమేష్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం జూపాడు బంగ్లాలోని కేజీబీవీ పాఠశాలలో సావిత్రి బాయ్ పూలే 194వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ యశోద పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.