నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారిని శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నందికొట్కూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టిడిపి సీనియర్ నాయకులు మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు.