సావిత్రిబాయి పూలే 194వ జయంతి వేడుకలు నందికొట్కూరు పట్టణంలోని ఏఐటీయూసీ అనుబంధ యూనియన్ "లారీ లోడింగ్ అన్లోడింగ్ హామలి వర్కర్స్" కార్యాలయంలో సిపిఐ పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించడం జరిగింది. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రఘురాంమూర్తి సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు మహానంది, వెంకటరమణ, స్వాములు తదితరులు పాల్గొన్నారు.