నందికొట్కూరు మండలం, బ్రాహ్మణ కొట్టుకూరు గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు పంజరి సుభాన్ (50) అనారోగ్యంతో శుక్రవారం ఉదయం 6:30 గం.లకు మృతి చెందారు. విషయము తెలుసుకున్న ఎమ్మెల్యే గిత్త జయసూర్య గ్రామానికి చేరుకొని సుభాన్ మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.