నంద్యాల పట్టణంలోని యోగ చైతన్య కేంద్రం నందు గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను యోగ గురువు దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. యోగ చైతన్య కేంద్రం నందు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. యోగచర్యులు రాపర్తి రామారావు చిత్రపటానికి పూలమాలవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో మాఘం వెంకటేశ్వర్లు, భావనాశి శ్రీనివాస, మహేష్, యోగ సభ్యులు పాల్గొన్నారు.