బండి ఆత్మకూరు: రాబోవు పదవి తరగతి పబ్లిక్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించాలని, ఉపాధ్యాయులు వెనుక బడిన విద్యార్థులకు ప్రత్యేక తర్ఫీదు ఇవ్వాలని నంద్యాల జిల్లా డిఇఓ పి. జనార్థన్ రెడ్డి అన్నారు. మంగళవారం సింగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. స్డడీ అవర్స్ పరిశీలించి ప్రార్థనలో పాల్గొన్నారు. ఆయన వెంట అసిస్టెంట్ సెక్టోరియల్ అధికారి జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.