ఫిబ్రవరి 8న నంద్యాలలో జిల్లా స్థాయి చెస్ పోటీలు

65చూసినవారు
ఫిబ్రవరి 8న నంద్యాలలో జిల్లా స్థాయి చెస్ పోటీలు
ఈనెల 8వ తేదీన నంద్యాల పట్టణంలోని నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు నంద్యాల జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తున్నారు. ఓపెన్ కేటగిరిలో మహిళలకు, పురుషులకు వేరు వేరు విభాగాలలో చెస్ పోటీలను నిర్వహిస్తున్నట్లు బుధవారం అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ రవికృష్ణ, రామసుబ్బారెడ్డిలు తెలిపారు. ఈ పోటీల్లో ఎంపికైన క్రీడాకారులు రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.

సంబంధిత పోస్ట్