నంద్యాల పట్టణంలో శుక్రవారం రోజున విజయవాడలో జరిగే హైందవ శంఖారావం కార్యక్రమానికి నంద్యాల రిటైల్ జనరల్ మర్చంట్ అసోసియేషన్ తరపున రెండు బస్సులు బయలుదేరాయి. ఆంజనేయ స్వామి గుడి నుండి హైందవ శంఖారావం సభ విజయవంతం అవ్వాలని ఆంజనేయస్వామికి మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లికార్జున శుక్రవారం పూజలు చేసి జైశ్రీరామ్ నినాదాలు చేపట్టారు. హిందువులు ఏకమై హైందవ శంఖారావం బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పారు.