నంద్యాల పట్టణంలోని నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ కార్యాలయం నందు గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎందరో అమరవీరుల, యోధుల త్యాగఫలమే మనకు నేడు లభించిన ఈ స్వేచ్ఛ, స్వాతంత్రం అని వారు తెలిపారు. సంఘం నాయకులు రమణయ్య, రామయ్య, మధు, శివరామిరెడ్డి, సుబ్బారెడ్డి, వెంకట్రావు పాల్గొన్నారు.