నందికొట్కూరుకు చెందిన కురవ బిందెల రవి, స్నేహితుడు వెంకటరమణను చంపిన కేసులో, కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. కబర్థి మంగళవారం యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ.10 వేల జరిమానా విధించారు. రవి, వెంకటరమణ నుండి అప్పు తీసుకున్న తర్వాత, అప్పు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేయటంతో, 2017 ఫిబ్రవరి 4న హత్య జరిపాడు. నేరం రుజువవడంతో న్యాయమూర్తి ఈ తీర్పును ఇచ్చారు.