ప్రపంచ జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని డా. ఆర్. వెంకటరమణ (DMHO) గారి నేతృత్వంలో, జిల్లా మలేరియా అధికారి కామేశ్వర రావు ఆధ్వర్యంలో శుక్రవారం డెంగ్యూపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక డీఎం & హెచ్వో కార్యాలయం నుండి సాయిబాబా నగర్ ఆర్చ్ వరకు సాగిన ర్యాలీలో "పరిశీలించండి, శుభ్రపరచండి, మూతలు పెట్టండి - డెంగును ఓడించండి" అనే నినాదంతో చైతన్యాన్ని కలిగించారు.