నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ మారుతి శంకర్ బుధవారం నంద్యాలలోని వెలాసిటీ జూనియర్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు సహకారంతో ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న నేరాల గురించి, మరీ ముఖ్యంగా సైబర్ క్రైమ్ నేరాలపై విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.