నంద్యాల: రాష్ట్ర స్థాయి చెస్ టోర్నమెంట్ కు జిల్లా జట్టు ఎంపిక పోటీలు

55చూసినవారు
నంద్యాల: రాష్ట్ర స్థాయి చెస్ టోర్నమెంట్ కు  జిల్లా జట్టు ఎంపిక పోటీలు
ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలలో ఓపెన్ కేటగిరిలో పాల్గొనే బాల, బాలికల నంద్యాల జిల్లా జట్టు క్రీడాకారులకు శనివారం ఎంపిక పోటీలు నిర్వహించారు. నంద్యాల జిల్లా చెస్ సంఘం నిర్వహణలో డాక్టర్ ఎస్. రాజశేఖర్ రెడ్డి సౌజన్యంతో చదరంగం పోటీలు నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు రవికృష్ణ కార్యదర్శి రామసుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ పోటీల్లో నూరు మంది చదరంగం క్రీడాకారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్