నంద్యాల జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నాగేంద్రప్ప రాష్ట్ర కౌన్సిల్ గోడ పత్రికను శనివారం ఆవిష్కరించారు. జూన్ 5న విజయవాడలో రాష్ట్ర అధ్యక్షుడు కె. ఆర్. సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర కౌన్సిల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. బకాయిలు, రాయితీలు, పీఆర్‌సీ తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.