నంద్యాలలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఫిల్టర్ బెడ్ పంప్ హౌస్‌లో స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో శనివారం న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ మొక్కలు నాటి, శుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు. అధిక ఎండల దృష్ట్యా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, టిడిపి నేతలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.