విద్యాశాఖలో సమూల మార్పులు తీసుకొస్తామని, 117 జీవోను పూర్తిగా రద్దు చేస్తామని చెప్తూ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 30 పైబడి ఉన్నా కూడా అసంబద్ధంగా యాజమాన్య కమిటీలు సూచనలు తీసుకోకుండా తరగతులను విలీనం చేయడం సరైంది కాదని ఎస్టీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి. శ్రీనివాసులు ఆదివారం ఎస్టీటీఎప్ కార్యాలయంలో అన్నారు. విలీనం విషయంలో విద్యాశాఖ అధికారుల అనాలోచిత నిర్ణయంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు.