నంద్యాల త్రీ టౌన్ సిఐగా బాధ్యతలు చేపట్టిన సూర్య మౌళిని నంద్యాల జనసేన నాయకులు రాచమడుగు చందు, సుందర్, దండు మురళి, మారాసు గురుబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. వారితోపాటు జనసైనికులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జనసేన నాయకులు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ చొరవ చూపాలని తెలిపారు. వారు నీతి, నిజాయితీగా పనిచేస్తారన్న మంచి పేరు ఉందని తెలిపారు.