పార్నపల్లె సూర్య దేవాలయంలో రథసప్తమి వేడుకలు

74చూసినవారు
నంద్యాల పట్టణానికి సమీపంలో బండి ఆత్మకూరు మండలం పార్నపల్లెలో వెలసిన శ్రీ సంజ్యాదేవి సమేత సూర్యనారాయణ స్వామి దేవస్థానం నందు మంగళవారం రథసప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ప్రాతఃకాలమే శ్రీ సంజ్యాదేవి సమేత సూర్యనారాయణ స్వామివారికి పంచామృతాభిషేకం స్థాపన తిరుమంజన సేవలు, మహా మంగళహారతులు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోహన్ గుప్తా, సుబ్బారావు ఆలయకమిటి సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్