నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పిలుపు మేరకు ఈ నెల 18న ఉదయం 8:30 గంటలకు నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి గాంధీ చౌక్ వరకు తిరంగ యాత్ర చేపట్టనున్నారు. భారత్ సైనికుల ధైర్య సాహసానికి సంఘీభావంగా, దేశ ఐక్యతను చాటే ఉద్దేశంతో టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు, స్వచ్ఛంద సంస్థలతో పాటు అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని ఎంపీ ఆహ్వానం తెలిపారు. యాత్ర ఏర్పాట్లపై టీడీపీ నాయకులతో గురువారం ఎంపీ సమావేశమయ్యారు.