నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని హిందూ స్మశాన వాటికలో నవనిర్మాణ సమితి పర్యవేక్షణలో బృందావనం ప్రాజెక్టును ప్రారంభించామని డా. మధుసూదన్ రావు శుక్రవారం తెలిపారు. ఇందులో శివుని విగ్రహం ముందు రాశి వనం పేరుతో 12 రాశులకు 12 మొక్కలను శాస్త్ర ప్రకారం ఎంచుకొని నాటడం జరిగింది. అందులో ఒక మొక్కను శివుని విగ్రహం ముందు న్యాయశాఖ మంత్రి ఫరూక్ నాటారు. బృందావనం ప్రాజెక్టులో 27 నక్షత్రాలకు సంబంధించి 27 రకాల మొక్కలు, 12 రాశులకు సంబంధించి 12 రకాల మొక్కలు నాటామని మొత్తం మూడు ఎకరాలలో 3600 పూల మొక్కలు నాటాలని తెలిపారు.