78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం ఆత్మకూరు పట్టణంలోని బిజెపి కార్యాలయంలో ఇన్చార్జి మెమిన్ షబానా ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎందరో అమరవీరుల, యోధుల త్యాగఫలమే స్వాతంత్ర దినోత్సవం అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి, ఉమ్మడి కూటమి నాయకులు పాల్గొన్నారు.