ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రంలో శుక్రవారం దేవస్థానం తరుపున పలు పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందులో శ్రైలం గ్రామ దేవత అంకాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు జరపనున్నారు. అలాగే సాయంత్రం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు ఊయల సేవ జరపనున్నారు. ఇదిలాఉంటే దేవస్థానం దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదికపై రాత్రి 7గంటల సమయంలో నిత్యకళారాధన కార్యక్రమాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరపనున్నారు.