శ్రీశైలం జలాశయంలో శనివారం ఉదయం 6 గంటలకు 852.00 అడుగుల నీటిమట్టం నమోదయింది. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 852.00 అడుగులు ఉండగా ప్రాజెక్టు గరిష్ట నీటి సామర్థ్యం 215.8070 టీఎంసీలకు గాను 84.48 టీఎంసీల నీటి నిలువలు నమోదు అయ్యాయి. ప్రాజెక్టు నుంచి ఎలాంటి ఇన్ఫ్లో, అవుట్ ఫ్లో నీటి విడుదల లేకపోవడంతో నీటి నిలువలు నిలకడగా నమోదు అయ్యాయి.