ఎమ్మిగనూరు మండలం బనవాసి గురుకుల కళాశాలలో ఇంటర్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన లైబ్రేరియన్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పలు విద్యార్థి సంఘాల నాయకులు, కళాశాల విద్యార్థినిలు ఆందోళనకు దిగారు. గురువారం లైబ్రేరియన్‌ను తొలగించాలని, అరెస్టుచేసి శిక్షించాలని, రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. రెండు నెలలుగా లైబ్రేరియన్ వేధింపులకు పాల్పడుతున్నా చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు