ఎమ్మిగనూరులో భవిత మానసిక దివ్యాంగుల స్కూల్ నందు స్కూల్ మేనేజ్మెంట్ బాబు, సుబ్రమణ్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన "లూయిస్ బ్రెయిలీ" జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈవోస్ 1, 2 లు అంజనేయులు, మధుసూదన్ రావు, గర్ల్స్ హై స్కూల్ అసిస్టెంట్ విజయ్ లలీత మేడం, సామాజిక వేత్త, మల్లేల గ్రూపు అధినేత శ్రీ ఆల్ఫ్రెడ్ రాజు తదితరులు హాజరయ్యారు.