అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని సిఐటియు జిల్లా నాయకులు ఈరన్న, వెంకటమ్మ డిమాండ్ చేశారు. బుధవారం ఆదోని మున్సిపల్ మైదానం నుంచి ర్యాలీగా వచ్చి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. స్కీం వర్కర్లకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, నాలుగు కోడ్లుగా విభజించిన చట్టాలను రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామన్నారు.