ఆదోని పట్టణంలోని వెంకన్నపేటలో గతనెల 28న లక్ష్మిశ్వేత అనే మహిళపై కత్తితో బెదిరించి బంగారు ఆభరణాలు దొంగిలించిన కేసులో నిందితుడు వడ్డే రవికుమార్‌ను సోమవారం ఆదోని టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం అతని వద్ద నుంచి రూ. 1. 50 లక్షల విలువైన 36. 36 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఆదోని రైల్వే స్టేషన్ వద్ద అతన్ని పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు.