ఆదోని పట్టణంలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల బస్సుల ఫిట్‌నెస్ గురించి విద్యార్థి సంఘాలు ప్రాంతీయ రవాణా అధికారి శిశిర దీప్తికి ఫిర్యాదు చేశారు. శనివారం పీఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు రాజు, ఎస్ఎస్ఏ శివప్రసాద్ గౌడ్, డీఎస్‌ఎఫ్ ఉదయ్ మాట్లాడారు. పాతబడి, ఫిట్‌నెస్ లేని బస్సులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బస్సులలో శిక్షణ లేని డ్రైవర్లు, సరైన పరికరాల లేకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.