ఆదోని పట్టణంలోని రాంజల పంప్ హౌస్ సమీపంలో ఎనిమిల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) సెంటర్ ను శనివారం మున్సిపల్ కమిషనర్ కృష్ణ ప్రారంభించారు. వీధి కుక్కల జనాభాను మానవీయంగా, సమర్థవంతంగా నిర్వహించే లక్ష్యంతో మున్సిపాలిటీలో ఎనిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ ను చేపడుతున్నామన్నారు. ఈ కేంద్రం ద్వారా వీధి శునకాల జనాభాను నియంత్రించేందుకు శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్టు మున్సిపల్ కమిషనర్ కృష్ణ తెలిపారు.