ఆదోని: ఆప్కోస్ సిబ్బంది నిరసన దీక్షలు

71చూసినవారు
ఆదోని: ఆప్కోస్ సిబ్బంది నిరసన దీక్షలు
ఆదోని పట్టణంలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి కూడలిలో శుక్రవారం పురపాలక ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఆప్కోస్ సిబ్బంది నిరసన దీక్ష చేపట్టారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి మీనాక్షి నాయుడు కుమారుడు భూపాల్ చౌదరి, సిబ్బందితో మాట్లాడి వారి డిమాండ్లపై అవగాహన పొందారు. పదేళ్లు పైబడిన సిబ్బందిని క్రమబద్ధీకరించాలి, సమాన పనికి సమాన వేతనం కల్పించాలి అన్నారు. విధి నిర్వహణలో మృతి చెందినవారి కుటుంబాలకు బీమా పరిహారం, ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్