వెనుకబడిన రాయలసీమ జిల్లాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు వెంటనే వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులను నిర్మించాలని ఆదోని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ డిమాండ్ చేశారు. శనివారం ఆదోనిలో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు రాయలసీమ కోసం మాట ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టల అభివృద్ధితో పాటు కర్నూలుపై దృష్టి సారించాలని కోరారు.