ఆదోని మండలంలోని పాండవగల్లు గ్రామంలో కారు ఢీకొని బైక్‌పై వెళ్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడిపోయారు. బుధవారం శివ, హనుమంతు అనే ఇద్దరు యువకులు బైక్‌పై రోడ్డు దాటుతుండగా, వికరాబాద్ కు చెందిన కారు వారిని ఢీకొంది. గమనించిన స్థానికులు గాయపడిన వారిని ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ రామచంద్రను ఎస్సై మహేష్ కుమార్ అదుపులోకి తీసుకొని, కేసు దర్యాప్తు ప్రారంభించారు.