ఆదోని పట్టణంలోని జంగాల కాలనీలోని గోపాల్, రాధ దంపతుల ఇంట్లో శుక్రవారం దొంగతనం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు. గోపాల్-రాధ పనులకై వెళ్లిన సమయంలో తాళం వేసిన ఇంట్లోకి చొరబడిన దొంగలు, ఇంట్లో బీరువాలో ఉన్న ఒక తులం బంగారం, రూ. 7 వేల నగదు, 30 తులాల వెండిని అపహరించారు. ఇంటికి వచ్చిన బాధితులు గమనించిన స్థానిక టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.