ఆదోని: గర్ల్స్ కాలేజీలో ఇంటర్ విద్యార్థుల నుంచి వసూళ్లు

61చూసినవారు
ఆదోని: గర్ల్స్ కాలేజీలో ఇంటర్ విద్యార్థుల నుంచి వసూళ్లు
ఆదోని గర్ల్స్ కళాశాలలో ఓపెన్ ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ సందర్భంగా ఉపాధ్యాయులు ఒక్కో విద్యార్థి నుంచి రూ.100 చొప్పున వసూలు చేస్తున్నారని శుక్రవారం పి. డి. ఎస్. యు, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. డబ్బులు లేనివారికి పరీక్ష రాసే అవకాశం లేదని తల్లిదండ్రుల ఫోన్‌పే ద్వారా చెల్లించాలని చెప్పడం బాధాకరమని అన్నారు. వెంటనే డబ్బులు తిరిగి ఇచ్చి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, అవసరమైతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్