ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో పత్తి ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. శుక్రవారం పత్తిధర క్వింటా గరిష్ఠంగా రూ. 7, 595 పలికింది. గతవారంతో పోల్చితే పత్తి ధర గరిష్ఠంగా క్వింటాకు రూ. 250 పైగా పెరిగింది. ధరలు పెరుగుతుండటంతో పత్తి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2, 385 క్వింటాళ్ల పత్తి విక్రయానికి రాగా వాటి కనిష్ఠ ధర రూ. 5వేలు, గరిష్ఠ ధర రూ. 7, 595 మధ్యస్థంగా రూ. 7289 పలికింది.