ఆదోని నియోజకవర్గంలోని తమ మధ్య లేని గొడవలు సృష్టించొద్దని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అన్నారు. ఆదివారం కర్నూలులో రెండోసారి ఎమ్మెల్సీగా బీటీ నాయుడు ఎన్నికైవడంతో టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. బీటీ నాయుడు రెండోసారి అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు తనకు తండ్రి లాంటి వాడని, తనపై ఎలాంటి విభేదాలు లేవని అన్నారు.