కర్నూలు జిల్లాలో నాటుసారాను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సోమవారం ఆదోని పట్టణం శివారు కొండల్లోని నాటుసారా స్థావరాలను ప్రోహిబిషన్, ఎక్సైజ్ సిఐ సైదుల్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి, 365 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి, 12 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని, ఇద్దరి వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.