ఆదోని పట్ణణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం వేరుశనగ ధరలో పతనం చోటుచేసుకుంది. క్వింటా ధర రూ. 6, 089కి చేరగా, ఇది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కంటే రూ. 1, 000 తక్కువ. 4, 700 బస్తాలు విక్రయానికి వచ్చాయి, అయితే రైతులు ధర తక్కువగా ఉన్నందున ప్రభుత్వం ఆయిల్‌ఫెడ్ ద్వారా మద్దతు ధరతో కొనుగోలు చేయాలని కోరారు. గరిష్ఠ ధర రూ. 6, 089, కనిష్ఠ ధర రూ. 3, 279గా ఉంది.