ఆదోని మండలంలోని పాండవగల్లు గ్రామంలో 24 ఎకరాల చెరువు కబ్జాకు గురైందని రైతు వెంకటేశులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటాయని, తాగునీరు లేక పొలాలు పాడవుతున్నాయని తెలిపారు. పలు మార్లు ప్రజా ప్రతినిధులకు వినతులు చేసినా స్పందన లేకపోవడం బాధకరమన్నారు.