ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ శుక్రవారం ఓ యువతి ప్రియుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. మైసూరు కు చెందిన యువతి చందన మంజునాథ్, ఆదోనికి చెందిన గురు ఈశ్వర్ ప్రసాద్ బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తూ, ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి పెద్దలు ఆమోదం తెలిపారు. డిసెంబరు 6న పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ప్రసాద్ ఆదోనికి వచ్చి తల్లిదండ్రులతో ఉడాయించడంతో, ఆదోని ఇంటి ముందే బైఠాయించింది.