ఆదోని: నిద్రిస్తుండగా ఇంటికి నిప్పు.. రూ. 5 లక్షల ఆస్తి నష్టం

59చూసినవారు
ఆదోని పట్టణం 8వ వార్డులో శాంతిరాజు ఇంటిపై కిరణ్ అనే వ్యక్తి పెట్రోలు పోసి నిప్పుపెట్టాడు. ఈ ఘటనలో రూ.5 లక్షల ఆస్తి నష్టం జరిగింది. శుక్రవారం జరిగిన ఈ ఘటనపై శాంతిరాజు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, గతంలో ఉన్న వ్యక్తిగత వివాదం కారణంగా కిరణ్ ఈ చర్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. ఇప్పటికే పోలీస్ స్టేషన్‌లో కిరణ్ పై కేసు ఉండటంతో, అది దృష్టిలో పెట్టుకుని ఇలా ఇంటికి నిప్పు పెట్టి చంపే ప్రయత్నం చేశారన్నారు.

సంబంధిత పోస్ట్