రీసర్వే ద్వారా భూ సమస్యలు పరిష్కరించబడతాయని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టులో భాగంగా శుక్రవారం ఆదోని మండలంలోని పెసలబండలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన సందర్భంగా సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. రీ సర్వేపై ప్రజలకు అవగాహన కల్పించి, మాట్లాడారు. ఎవరికైనా రైతులకు రీసర్వేలో అనుమానాలు ఉంటే అర్జీలు సమర్పించాలన్నారు.