ఆదోని పట్టణంలోని కేజీబీవీ జూనియర్ కళాశాలలో పది, ఇంటర్మీడియట్ తరగతి విద్యార్థినులకు శనివారం సమగ్రశిక్ష ప్రాజెక్టు ఆధ్వర్యంలో 10 రోజుల ఎలక్ట్రానిక్స్ వృత్తి విద్య ఇంటర్న్ షిప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, విద్యార్థినులు సమీపంలోని వివిధ సంస్థలలో – సాముల్ మోటార్ అండ్ రివైండింగ్, ఓం సాయి ఎలక్ట్రానిక్స్, తేజస్ ఈ-బైక్స్, ధనలక్ష్మి స్టీల్ వెల్డింగ్ వంటి చోట్ల పరికరాల మరమ్మతుల శిక్షణ పొందారు.