డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఆదోని మున్సిపల్ మైదానంలో శనివారం జైభీమ్ క్రికెట్ టోర్నీ నిర్వహించారు. ఆదోని టూ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి హాజరై, పోటీలను ప్రారంభించిన ఆయన, క్రీడాకారులు క్రీడా ల్లో గెలుపుపోటములను సమానంగా స్వీకరించి, ఓటమిని స్ఫూర్తిగా మార్చుకోవాలని సూచించారు. బెస్ట్ లెవల్ జట్టుపై నైట్ ఆర్ట్స్ లెవన్ జట్టు 72 పరుగులతో విజయం సాధించిందని తెలిపారు.