ఆదోని: కర్ణాటక మద్యం స్వాధీనం, ఇద్దరు అరెస్టు

85చూసినవారు
ఆదోని ఎక్సైజ్ సీఐ సైదూల్లా ఆధ్వర్యంలో కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నారు. రూ. 2 లక్షల విలువ గల 50 బాక్సులు, బొలేరో వాహనాన్ని స్వాధీనం చేసుకొన్నారు. కర్ణాటక నుండి ఆస్పరి మండలం కైరుప్పల గ్రామానికి మద్యం తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన మహేంద్ర, సుధీర్ కుమార్ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారిపై దాడులు చేసి, మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్