ఆదోని: దళిత కాలనీలో సీసీరోడ్లు వేయండి: కెవిపిఎస్ డిమాండ్

65చూసినవారు
ఆదోని: దళిత కాలనీలో సీసీరోడ్లు వేయండి: కెవిపిఎస్ డిమాండ్
ఆదోని మండలం సంతేకూడ్లూరులో కెవిపిఎస్ ఆధ్వర్యంలో దళిత కాలనీలో సీసీరోడ్లు, డ్రైనేజీ కాలువలు వేయాలని అధికారులకు వినతిపత్రం సమర్పించారు. శుక్రవారం మండల కార్యదర్శి బి. తిక్కప్ప మాట్లాడుతూ చిన్నపాటి వర్షాలకు ఇళ్లలోకి నీరు వస్తుందని, ఏ ప్రభుత్వం వచ్చిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ధర్నాకు సిద్ధమవుతామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్