ఆదోని: రేపు సైనికులకు మద్దతుగా కదలిరండి

58చూసినవారు
దేశ సైనికుల త్యాగాలకు సంఘీభావంగా ఆదోనిలోని మున్సిపల్ గ్రౌండ్స్‌ నుండి ఆదివారం ఉదయం 10 గంటలకు 'తిరంగ యాత్ర' నిర్వహించనున్నట్లు ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు సంఘీభావంగా జరిగే ఈ యాత్రలో త్రివర్ణ పతాకాలతో పాల్గొని దేశభక్తిని ప్రదర్శించమని పిలుపునిచ్చారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్