ఆదోని మండలంలోని నెట్టేకల్ క్రాస్ సమీపంలో గంజాయి తరలిస్తున్న తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు తాలుకా సీఐ నల్లప్ప శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం చిన్న పెండేకల్ గ్రామానికి చెందిన కురువ కోదండ రాముడు 312 గ్రాముల గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గంజాయి స్వాధీనం చేసుకుని, అతడిపై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. ఈ దాడిలో డీటీ వలీబాషా పాల్గొన్నారు.